పెద్దాస్పత్రిలో పడకేసిన పాలన

Published: Saturday January 30, 2021

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌లో పాలన పూర్తిగా పడకేసింది. అక్కడ à°“ ఆర్‌ఎంవో ఏం చెబితే అదే జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన కాదన్న ఫైళ్లు వెనక్కి వెళ్లిపోతాయని, సూపరింటెండెంట్‌ పూర్తిగా ఆయన సలహాలపైనే ఆధారపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సుమారు ఐదు నెలల కిందట కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌à°—à°¾ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ మైథిలి ఆస్పత్రిపై పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోవడంతో పాలనా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ ఫైలు తీసుకువెళ్లినా రోజుల తరబడి పెండింగ్‌లో పెట్టేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రోజుల తరబడి ఇదే పరిస్థితి ఎదురవుతుండడంతో విసుగుచెందిన కొంతమంది అధికారులు విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో...సీఎస్‌ఆర్‌ బ్లాక్‌కు సంబంధించిన అత్యవసర ఫైల్స్‌ ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ వద్దకు పంపాలని సూచించినట్టు సమాచారం.

వైద్య సేవల పరిశీలనకూ దూరం 

గతంలో సూపరింటెండెంట్లుగా పనిచేసిన వారిలో పలు వురు ఉదయం, సాయంత్రం వేళల్లో రౌండ్స్‌కు వెళ్లి...ఆయా విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరి శీలించేవారు. డాక్టర్‌ మైథిలి సూపరింటెండెంట్‌à°—à°¾ వచ్చిన తరువాత అతికొద్ది సందర్భాల్లో మాత్రమే రౌండ్స్‌కు వెళ్లారని, ఎక్కువ సమయం కార్యాలయానికే పరిమిత మవుతున్నారని చెబుతున్నారు. ఆస్పత్రి సిబ్బందితోనూ ఆమె మాట్లాడేందుకు ఇష్టపడరని, à°’à°• ఆర్‌ఎంవో చెప్పినట్టుగానే చేస్తుంటారని, ఆయన ఓకే చెప్పిన ఫైళ్లపైనే సంతకాలు చేస్తుంటారని చెబుతున్నారు.  

సిబ్బంది ఇష్టారాజ్యం

పాలనాపరమైన అంశాలను సూపరింటెండెంట్‌ పట్టించు కోకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా వైద్యులు, నర్శింగ్‌ సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టమొచ్చినట్టు విధులకు హాజరవుతున్నా రన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది వైద్యులు ఎప్పుడు ఆస్పత్రికి వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో కూడా తెలియడం లేదని, కొన్ని విభాగాల్లో ప్రొఫెసర్లు...పీజీలపైనే పూర్తి భారాన్ని మోపి ప్రైవేటు సేవలో తరిస్తున్నా.. సూపరింటెండెంట్‌ పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటున్నారు. దీంతో à°—à°¤ కొద్దినెలలుగా శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది పనితీరు మరింత అధ్వానంగా మారింది. వీరి పనితీరును బట్టి మార్కులు ఇచ్చి, జీతాలకు సంబంధించిన బిల్లులను ఆర్‌ఎంవోలు పెడుతుంటారు. అయితే, ఆయా ఫైళ్లను పరిశీలించాల్సిన సూపరింటెండెంట్‌ పట్టించుకోకపోవడంతో ఆర్‌ఎంవోలు పెట్టిన బిల్లులు ఖరారవుతున్నాయని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొందరు హెడ్‌ నర్సులు సెలవు పెట్టకుండానే రోజుల తరబడి విధులకు డుమ్మా కొట్టినా పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. వీటితోపాటు ఇంకా...అనేక పాలనాపరమైన ఇబ్బందులున్నాయని ఆయా విభాగాలకు చెందిన అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.