రాజ్యాంగ వ్యవస్థలపైనే దాడి!

Published: Sunday January 31, 2021

‘వైసీపీలో రెండో పవర్‌ పాయింట్‌ ఉండకూడదన్న ఉద్దేశంతోనే షర్మిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులను ప్రభుత్వ కార్యకలాపాలకు సీఎం జగన్‌ దూరంగా ఉంచారు. 2014 ఎన్నికల్లోనే జగన్‌-షర్మిల మధ్య అగాథం ఏర్పడింది. అన్నతో పెరిగిన దూరం వల్లే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజిస్టర్‌ కూడా చేశారు. ముహూర్తం కూడా ఖరారైంది. వైఎస్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన కొందరితో షర్మిల భర్త అనిల్‌ సంప్రదింపులు జరుపుతున్నారు’ అని మాజీ ఎంపీ సబ్బం హరి తెలిపారు. శనివారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’లో నిర్వహించిన ‘బిగ్‌ డిబేట్‌’లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వైసీపీ పెట్టిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా మొదట షర్మిలను నిలబెట్టాలని భావించినా, అనివార్య కారణాల వల్ల విజయమ్మను బరిలో నిలిపారు. అప్పటి నుంచే అన్నా, చెల్లెలి మధ్య అగాథం ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుటుంబం గురించి గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఎంతోమంది.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పదవులు అనుభవిస్తుంటే, పార్టీ కోసం కష్టపడిన, తన బిడ్డ షర్మిలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించకపోవడం పట్ల విజయమ్మ ఆగ్రహంగా ఉన్న మాట వాస్తవమే. అన్నపై ఆగ్రహంగా ఉన్న షర్మిల ఇప్పటికే పార్టీని రిజిస్టర్‌ చేయడంతోపాటు ప్రకటించేందుకు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. అయితే, కుటుంబం పరువు రోడ్డున పడకుండా ఉండేందుకు మధ్యే మార్గంగా విజయమ్మ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది’’ అని హరి అన్నారు. 

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పట్ల ప్రభుత్వం, ప్రభు త్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు పై విద్యావంతుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డపై చేస్తున్న వ్యాఖ్యలను రాజ్యాంగ వ్యవస్థలపై దాడిగానే పరిగణించాలి. గతంలో జగన్‌ను, వైఎస్‌ కుటుంబాన్ని దుర్భాషలాడిన ఎంతోమంది ఇప్పుడు వారిపై ఈగ వాలనీయబోమన్నట్టు మాట్లాడడం విడ్డూరం. భారతంలో అత్యంత రాక్షస మనస్తత్వం కలిగిన ‘కేలనేము’ మాదిరిగా à°ˆ ప్రభుత్వ పెద్ద తయారయ్యాడు. స్థానిక ఎన్నికల విషయంలో, అదీ రమేశ్‌కుమార్‌ చేతిలో ఓడిపోయే పరిస్థితి రావడంతో జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. జీతం, అటెండర్‌ లేకుండా చేసినా.. నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించడాన్ని సహించలేకపోతున్నట్టు ప్రభుత్వ పెద్దల మాటలతో అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు.