రేషన్ డెలివరీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Published: Sunday January 31, 2021

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ‘ఇంటింటికీ రేషన్ పథకం’పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. à°ˆ పథకానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కొద్దిసేపటి క్రితం పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశిస్తూ... దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని రెండు రోజుల్లో ఎస్ఈసీని కలవాలని స్పష్టం చేసింది.

 

ఐదు రోజుల్లో à°ˆ అంశంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రజా సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరని...ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అంతకుముందు రాజకీయ పార్టీల రంగుల్లేకుండా పథకం నిర్వహించుకోవచ్చని ఎస్‌ఈసీ సూచించింది. దీనిపై ఏపీ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.