గ్రామాల్లో పర్యటిస్తే ఎన్నికల టూరే!

Published: Sunday January 31, 2021

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున గ్రామాల్లో మంత్రులు పర్యటన చేపడితే దానిని ఎన్నికల టూర్‌à°—à°¾ పరిగణించాలని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాశారు. మంత్రుల భద్రతా సిబ్బంది తప్ప, మిగిలిన ఉద్యోగులెవరూ వెంట ఉండరాదన్నారు. వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల పర్యటనలన్నీ ఎన్నికల పర్యటనగానే పరిగణించాలన్నారు. ప్రభుత్వ భవనాల్లో ప్రెస్‌మీట్లు పెట్టడం కూడా నియమావళి ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. కాగా, జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను తొలగించకపోవడంపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎ్‌సకు మరో లేఖ రాశారు. ఆదేశాలు అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కుల, నో డ్యూస్‌ సర్టిఫికెట్లు సకాలంలో అందేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.