అచ్చెన్నాయుడు అరెస్ట్‌

Published: Tuesday February 02, 2021

శ్రీకాకుళం: à°Ÿà±€à°¡à±€à°ªà±€ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. à°ˆ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

à°—à°¤ మూడు రోజులుగా నిమ్మాడ రగిలిపోతోంది. అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు à°† బంధువుకు ఫోన్ చేసి నచ్చజెప్పాలని చూశారు. అయితే అచ్చెన్నాయుడు బెదిరించనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ హల్ చల్ చేశారు. నేరుగా వైసీపీ కార్యకర్తలను దాడి చేయండి, తన్నండి, చంపండి అంటూ రెచ్చగొట్టారు. క్రికెట్ బ్యాట్‌లు పట్టుకుని రోడ్లపై భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు నడిచి బీభత్సం సృష్టించారు. అయితే వారెవరిపైనా కేసులు నమోదు అవలేదు. అచ్చెన్నాయుడుపై మాత్రం కేసు నమోదు అయ్యింది. à°† కేసు ఆధారంగానే అచ్చెన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు నిమ్మాడలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు ముందే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం వ్యూహాత్మకమే అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు