మాజీ ప్రియురాలిపై మాజీ ప్రియుడు గొడ్డలితో దాడి

Published: Tuesday February 02, 2021

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో ఘోరం జరిగింది. మాజీ ప్రియురాలు విమలపై మాజీ ప్రియుడు రాహుల్ గౌడ్ గొడ్డలితో దాడి చేశాడు. విమల నివాసంలోనే à°ˆ దాడి జరిగింది. à°ˆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.  పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు విమలను స్థానిక ఆస్పత్రికి తరలిచారు.

 

 à°¤à°¨à°ªà±ˆ మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో 354 న్యూసెన్స్ కేసు పెట్టి జైల్‌à°•à°¿ పంపించిందని విమలపై రాహుల్ కక్ష పెట్టుకున్నాడు. జైల్ నుంచి వచ్చిన రాహుల్ గౌడ్  గతాన్ని మనసులో ఉంచుకుని విమలపై  గొడ్డలితో దాడి చేశాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దాడి సమాచారాన్ని పోలీసులకు స్థానికులు అందించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాహుల్‌ను పట్టుకోవడానికి 4 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. à°ˆ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.