ప్రతీ పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోము

Published: Saturday February 06, 2021

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పందించారు. నీతి ఆయోగ్ సూచనల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతీ పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మకానికి పెట్టబోమని వెల్లడించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను మాత్రమే నీతీ ఆయోగ్ సూచనల మేరకు ప్రైవేటీకరణ చేస్తామని అనురాగ్ సింగ్ తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం పోలవరం ప్రాజక్టుకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. à°ˆ మధ్య కాలంలో ఏపీ ఆర్థికమంత్రి పోలవరం నిధులపై మూడు సార్లు కలిశారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు. బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని అనురాగ్ సింగ్ తెలిపారు.