ఏకగ్రీవాలకు గ్రీన్‌సిగ్నల్‌

Published: Monday February 08, 2021

రేపే ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉంటే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై గతంలో ఎస్‌ఈసీ సీరియస్ అయ్యారు. ఏకగ్రీవాలను ప్రకటించొద్దని కలెక్టర్లకు ఆదేశించారు. తాజాగా à°ˆ రెండు జిల్లాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రెండు జిల్లాల ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. à°ˆ మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్నికల కమిషన్ సమాచారం అందించింది. రేపోమాపో ఏకగ్రీవం అయిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.