ఎన్నికల కమిషనర్‌ భరోసా

Published: Tuesday February 09, 2021

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు రాజ్యాంగపరంగా అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తెలిపారు. నిర్భయంగా విధులు నిర్వహించాలని సూచించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయంలో కమిషనర్‌తో ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు (ఏపీ జేఏసీ అమరావతి), చంద్రశేఖరరెడ్డి (ఏపీ ఎన్‌జీవో), సూర్యనారాయణ (ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) సమావేశమయ్యారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు అభద్రతాభావం లేకుండా విధులు నిర్వర్తించాలని, వారికి ఎస్‌ఈసీ à°…à°‚à°¡à°—à°¾ ఉంటుందని భరోసా ఇచ్చారు.  భద్రతకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కూడా వివరిస్తున్నామని తెలిపారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని.. వారిలో విశ్వాసం పాదుకొల్పడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉద్యోగులు, పోలీసులు ఎన్నికల విధుల్లో అంకితభావంతో పని చేస్తున్నారని ఆయన కితాబిచ్చినట్లు ఎస్‌ఈసీ à°“ ప్రకటనలో వెల్లడించింది. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య పరిణామాలతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై  కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాం. కొన్ని కేటగిరీల ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాం. ఎన్నికల సిబ్బందికి భద్రత కల్పించాలని, కనీస వసతులు కల్పించాలని కోరాం. చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాం.

పోలింగ్‌బూత్‌à°² వద్ద మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని , ఉద్యోగులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరాం. కొవిడ్‌ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశాం. నోటిఫికేషన్‌కు ముందే ఉద్యోగ సంఘాలతో ఎస్‌ఈసీ సమావేశమై ఉంటే బాగుండేది.