మంత్రి కొడాలి నానికి సొంతఊరిలోనే చేదు అనుభవం

Published: Sunday February 14, 2021

మంత్రి కొడాలి నానికి సొంతఊరిలోనే చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు పంచాయతీపై టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 à°“ట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. à°ˆ గెలుపుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజంగా ఇది నానికి ఊహించని షాక్ అని కొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాదలో వైసీపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి గొల్లపల్లి పార్వతి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్‌ స్వగ్రామంలో నిమ్మకూరులో సర్పంచ్‌ స్థానాన్ని టీడీపీ బలపరిచిన పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో కైవసం చేసుకున్నారు.