సంతృప్తి చెందని హైకోర్టు

Published: Monday February 15, 2021

 à°®à°‚త్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు అందించిన వీడియో టేపులతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. అయితే à°ˆ కేసును లోతుగా విచారించాలని ధర్మాసనం తెలిపింది. కోర్టుకు సహాయ పడేందుకు నేటి సాయంత్రం లోపు అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషనర్ సరైన వీడియో టేపులను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది కూడా బుధవారం నాటికి వీడియో టేపులను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. 

 

à°ˆ కేసుపై ఆదివారం హైకోర్టులో విచారించారు. కొడాలి నాని పత్రికా సమావేశంలో మాట్లాడిన విషయాలను పరిశీలించిన తరువాతే ఎస్‌ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న ఆయన అభ్యర్ధన పై తగు నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది... హైకోర్టును కోరారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ని పరిశీలించిన తరువాతే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఎస్‌ఈసీ, ఎన్నికల కమిషనర్‌ పై మంత్రి అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని తెలిపారు. à°ˆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... మీడియా సమావేశంలో పిటిషనర్‌ మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను, అందులోని అంశాలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఫుటేజ్‌లోని వివరాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. à°ˆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా సమావేశంలో ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కమిషనర్‌ ప్రతిష్ఠకు à°­à°‚à°—à°‚ కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.