వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Published: Monday February 15, 2021

భారతదేశంలో జనవరిలో ప్రవేశపెట్టిన నూతన గోప్యతా విధానం (ప్రైవసీ పాలసీ)పై ఫేస్‌బుక్, వాట్సాప్‌లకు సుప్రీంకోర్టు సోమవారంనాడు నోటీసులు పంపింది. వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని à°† నోటీసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సమాధానం తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.

 

 

'మీది  2 నుంచి 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు, కానీ దేశ ప్రజలకు గోప్యత అనేది అన్నింటికంటే చాలా విలువైనది. వారి గోప్యతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది' అని ఫేస్‌బుక్, వాట్సాప్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. గోప్యత కోల్పోతామనే భయాందోళన ప్రజల్లో ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 

వాట్సాప్ ప్రతినిధిగా కపిల్ సిబల్ తన వాదన వినిపిస్తూ, నూతన విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు పోతుందన్న వాదన సరికాదన్నారు. ప్రైవసీపై యూరప్‌లో ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టానే తీసుకు వస్తే దానినే అనుసరించడం జరుగుతుందని అన్నారు. à°—à°¤ నెల ప్రారంభంలో తాము అందిస్తున్న సేవలు, ప్రైవసీ పాలసీలో వాట్సాప్ మార్పులు చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో à°† గడువును మే 15 వరకూ పొడిగించింది.