ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Published: Monday February 15, 2021

 à°¸à±à°¥à°¾à°¨à°¿à°• సంస్థల ఓట్ల లెక్కింపును వీడియో రికార్డ్ చేయాలని ఏపీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. à°ˆ పిటిషన్‌ను సోమవారం కోర్టు విచారించింది. కౌంటింగ్‌ను వీడియో రికార్డింగ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టులో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను ఎలా గుర్తిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. తగిన వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది.