ఎన్నికల అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ

Published: Wednesday February 17, 2021

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీచేసిన ఉత్తర్వుల మేరకు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఎంపీడీవోలు పరిశీలించి, తక్షణం స్పందించాలని ఆదేశించింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే ప్రతీఒక్కరి లక్ష్యమనీ, వనరుల కొరత తదితర కారణాలు à°ˆ లక్ష్య సాధనకు అడ్డంకి కాకూడదనీ స్పష్టం చేసింది. à°ˆ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు మంగళవారం తీర్పు వెలువరించారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను సీసీ కెమెరాలు లేదా వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణాజిల్లాకు చెందిన శ్రీపతి నాచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన à°Žà°‚. ప్రతాప్‌ నాయక్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. 

 

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, à°Ÿà°¿.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ... ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదన్నారు. 3, 4 దశల్లో జరిగే ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ... మొదటి పిటిషనర్‌ గ్రామమైన తవిశపూడిలో సీపీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామనీ, ఎన్నికల పరిశీలకుడినీ నియమించామన్నారు. వీడియోగ్రఫీకి ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తామన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది కిరణ్‌ వాదనలు వినిపిస్తూ... ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్‌ఈసీ ఆదేశాలను ప్రభుత్వ అధికారులు అమలు చేస్తున్నారన్నారు. à°ˆ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ‘‘నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఎస్‌ఈసీ, ప్రభుత్వం హామీ ఇస్తున్నాయి. ఫిర్యాదుల పై తక్షణం స్పందించాలని ఎంపీడీవోలను ఆదేశించినట్లు ఎస్‌ఈసీ చెబుతోంది. కాబట్టి, అధికారులు à°ˆ విధంగా ప్రవర్తించాలని నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం’’ అని తీర్పులో పేర్కొన్నారు.