ఆ భూములతో వ్యాపారం చేస్తామంటే సహించం

Published: Friday February 19, 2021

మిగులు భూములు అమ్మితే స్టీల్‌ప్లాంట్‌ సమస్యలన్నీ తీరిపోతాయన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, భూనిర్వాసితులు భగ్గుమంటున్నారు. ఎవరి భూముల్ని ఎవరికి అమ్ముతారని తీవ్ర స్థాయిలో నిర్వాసితులు ధ్వజమెత్తుతున్నారు. ‘‘పరిశ్రమ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆనాడు భూములు ఇచ్చాం. ఇప్పుడు à°† భూములతో వ్యాపారం చేస్తామంటే సహించేది లేదు’’అని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం భూములు వద్దనుకుంటే నిర్వాసిత నిరుద్యోగులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం నెలిముక్కు, సిద్ధేశ్వరం, నడుపూరు, గంగవరం, దిబ్బపాలెం, కణితి, అప్పికొండ, వడ్లపూడి, కొండయ్యవలస పంచాయతీల పరిధిలో à°—à°² 64 గ్రామాల్లో 1971లో 15 వేల ఎకరాలు ఆనాడు సేకరించారు. అప్పట్లో ఎకరానికి రూ.1,200 చొప్పున చెల్లించారు. à°† మొత్తం సరిపోదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో 1973లో మూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చారు.

 

ప్లాంట్‌ అవసరాల నిమిత్తం భూమి ఇంకా అవసరమని భావించి.. à°† తరువాత మరో 11 వేల ఎకరాలు సేకరించారు. అప్పట్లో 16 వేల మందిని నిర్వాసితులుగా గుర్తించారు. భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, ఇల్లు కోల్పోయిన వారికి 107 గజాల స్థలం, నిర్వాసితులుగా గుర్తించే కార్డు (ఆర్‌-కార్డు) ఇచ్చారు. ఇలా సేకరించిన మొత్తం 26 వేల ఎకరాల్లో 18 వేల ఎకరాలు ప్లాంట్‌ నిర్మాణం, టౌన్‌షిప్‌ కోసం వినియోగించారు. ఇంకా ప్లాంట్‌ వద్ద సుమారు ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది. ఇదిలాఉండగా 16 వేల మంది నిర్వాసితుల్లో ఇప్పటివరకూ ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించగా, మరో ఎనిమిది వేల మంది ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంతలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంతో కేంద్రం ముందుకు రావడం, à°† ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉక్కు సంఘాలు విశాఖ కేంద్రంగా కొన్నివారాలుగా ఉద్యమిస్తుండటం తెలిసిందే. బుధవారం విశాఖ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్‌ à°ˆ సమస్యపై స్పందించారు. స్టీల్‌ప్లాంట్‌ వద్ద నిరుపయోగంగా ఉన్న ఏడువేల ఎకరాలు విక్రయిస్తే ప్రైవేటీకరణ అవసరం లేకుండానే నిధుల సమస్య తీరిపోతుందని తనను కలిసిన కొందరు కార్మిక సంఘాల నేతల వద్ద అభిప్రాయపడ్డారు. అయితే, సీఎం సూచనను నిర్వాసితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ప్లాంట్‌ విస్తరణతో ఉపాధి లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఇలా మాట్లాడటం తగదని నిరుద్యోగ నిర్వాసితులు మరింతగా వాపోతున్నారు. ముందస్తు ప్రణాళికతో భాగంగానే ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి నిర్వాసితులను పిలవలేదని నిర్వాసితుల ఐక్య సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.