పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం

Published: Sunday February 21, 2021

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నా.. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరుగుతున్నాయి. అధికారపార్టీ బలపర్చిన అభ్యర్థులు డబ్బులు పంచుతూ కెమెరాలకు చిక్కుతున్నారు. విశాఖ జిల్లా, భీమిలీ మండలం, తాటిచూరు గ్రామంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల ఉన్నతాధికారులు కూడా గ్రామానికి వచ్చారు. స్థానిక ఎస్ఐ గ్రామస్తుడిని కొట్టారు. ఈ క్రమంలో గ్రామస్తుడికి కాలు ఫ్యాక్చర్ అయింది. దీంతో గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. పార్టీలు వేరైనా ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని స్థానికులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇది ఖచ్చితంగా పోలీసుల కక్ష సాధింపేనన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే పోలీసులే అల్లర్లు సృష్టిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు.