పోలవరం ప్రాజెక్టులో అద్భుతం

Published: Monday February 22, 2021

 à°ªà±‹à°²à°µà°°à°‚ ప్రాజెక్టులో మరో అద్భుతం చోటుచేసుకుంది. గేట్లకు హైడ్రాలిక్ సిలెండర్ల ఏర్పాటు ప్రారంభించారు. జర్మనీ నుండి పోలవరం ప్రాజెక్ట్‌కు హైడ్రాలిక్ సిలిండర్లు చేరుకున్నాయి. à°ˆ రోజు మొదటి గేటుకు సిలిండర్లును మెగా ఇంజినీరింగ్ సంస్థ అమర్చింది. ఒక్కో గేటుకు 2 సిలిండర్లను జర్మనీకి చెందిన ఇంజినీర్లు అమర్చుతున్నారు. 48 గేట్లకు 96 సిలిండర్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ అమర్చనుంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రాలిక్ సిలిండర్లతో గేట్లను ఎత్తే టెక్నాలజీ వినియోగిస్తున్నారు. పోలవరం గేటు బరువు 300 టన్నులు ఉటుందని అధికారులు తెలిపారు. గేట్లను పైకి, కిందకు దించడానికి ఎత్తడానికి వీలుగా ఒక్కో గేటుకు 200 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం à°—à°² రెండు హైడ్రాలిక్ సిలెండర్లను గేటు చెరో వైపు అమర్చుతామని అధికారులు తెలిపారు. స్పిల్‌వేకు 48 గేట్లు ఉండగా, ఇప్పటి వరకూ 29 గేట్లనే అమర్చామని అధికారులు చెబుతున్నారు. గేట్లకు హైడ్రాలిక్‌ సిలెండర్లు, పవర్‌ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. à°ˆ గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవని తెలిపారు. 52 మీటర్ల ఎత్తున స్పిల్‌వే ఫిల్లర్స్‌ నిర్మాణం పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.