వాలంటీర్ల వ్యవస్థను వెంటనే తీసేయాలి
Published: Monday February 22, 2021

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను వెంటనే తీసేయాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు వారధి కాకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని విమర్శించారు. ఆ వ్యవస్థను వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. కుప్పంలో కూడా ఎవరిని నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ పూర్తిగా భయబ్రాంతులకు గురి చేసి ఏకపక్షంగా గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Share this on your social network: