నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Published: Monday February 22, 2021

స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్లు నష్టంతో 49,744 వద్ద .. నిఫ్టీ 306 పాయింట్ల కోల్పోయి 14,706 వద్ద ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రేపటి రోజు ఎలా ఉంటుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. అయితే.. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ ప్రయత్నం జరిగి.. సూచిల్లో కొత్ పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. మహారాష్ట్రలోని రెండు నగరాల్లో లాక్‌డౌన్ ప్రకటన కూడా ప్రతికూల సెంటిమెంట్‌కు కారణమైందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వారంలో గానీ.. వచ్చే వారం మొదట్లొ గానీ మార్కెట్ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే సానుకూల సంకేతాలే ఉన్నాయని చెబుతున్నారు. ఇది పెట్టుబడులకు అనూకూలమనే సూచనలు కూడా వెలువడుతున్నాయి.