ఎన్నికలపై హైకోర్టులో భిన్న వాదనలు

Published: Tuesday February 23, 2021

మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్ట్‌లో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పుర ప్రక్రియను కొత్తగా చేపట్టాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు. ఆగిన చోటు నుంచి మొదలు పెట్టే అధికారం ఎస్ఈసీకి లేదని, నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకట రమణ, వీరారెడ్డి వాదనలు వినిపించారు. 

 

సంవత్సరం క్రితం నిలిచిపోయిన నోటిఫికేషన్‌ను మరలా à°Žà°² పునరుద్ధరిస్తారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ప్రశ్నించారు. కాగా, తాజా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్ట్‌లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచి ప్రారంభించేలా చట్టంలో, రాజ్యాంగంలో లేదని పేర్కొన్న పిటిషనర్ల తరపున న్యాయవాదులు. ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో అక్కడ్నుంచే తిరిగి ప్రారంభించామని చెప్పిన ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు వాదించారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు గురై ఎవరైన నామినేషన్లు వేయకపోతే వారికి తిరిగి అవకాశం కల్పించిన ఉత్తర్వులను కోర్టుకు ఎస్ఈసీ అందించారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైతే మళ్లీ రద్దు చేసి ప్రారంభించే అవకాశం లేదని కమిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.