ఓటర్లకు ప్రధాని మోదీ గిఫ్ట్

Published: Wednesday March 03, 2021

 à°¬à±†à°‚గాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాయే స్వయంగా రంగంలోకి దిగి... కార్య క్షేత్రాన్ని ఆకళింపు చేసుకున్నారు. బెంగాలీ ఓటర్లను ఆకర్షించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఓటర్లను, కార్మికులను ఆకర్షించడానికి కేంద్రం మరో ముందడుగు వేసింది. జనప నార కనీస మద్దతు ధరను పెంచాలని  మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ à°ˆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 6 లేదా 7 శాతం మేరకు జనపనార కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయించుకుంది. ఇలా జనపనారకు కనీస మద్దతు ధరను పెంచడం రెండోసారి. క్వింటాల్ కనీస మద్దతు ధర 3,700 రూపాయలుండగా, కేంద్రం 2019 లో ఏకంగా 3,950 రూపాయలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే జనపనార కనీస మద్దతు ధర పెంచడం ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించవచ్చని, తద్వారా దేశంలో అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా బెంగాల్‌ను దృష్టిలో పెట్టుకునే à°ˆ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 70 జనపనార మిల్లులుండగా, 60 మిల్లులు కేవలం బెంగాల్‌లోనే ఉన్నాయి. à°ˆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం à°ˆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.