పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు వలంటీర్ల ప్రచారం

Published: Wednesday March 03, 2021

పురపాలక ఎన్నికల్లో వార్డు వలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టుకు నివేదించింది. à°ˆ నేపథ్యంలోనే వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ వలంటీర్లపై 600 ఫిర్యాదులు అందాయని.. అయితే అవి పార్టీరహిత ఎన్నికలు కావడంతో ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ తెలిపారు. పురపాలక ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నాయని.. అధికార పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థికి ఓటేస్తారనుకున్న వారికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం లేదని.. వలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం కోసమే వారిని à°ˆ ప్రక్రియకు దూరంగా ఉంచామన్నారు. పెన్షన్‌ పంపిణీ విషయంలో తాము అభ్యంతరం చెప్పడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లను దూరంగా ఉంచుతూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సోమవారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది.

 

à°† ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి à°Žà°‚.అజయ్‌ జైన్‌ వ్యాజ్యం వేశారు. మరోవైపు వార్డు వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వారిని విధులకు దూరంగా ఉంచాలని విశాఖ తూర్పు టీడీపీ ఎమెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలతో వలంటీర్లకు సంబంధం లేదని.. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ సచివాలయ సిబ్బంది చేపడతారని పేర్కొన్నారు. వలంటీర్ల వద్ద పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉంటాయని.. మొత్తం డేటా ఉండదన్నారు. కరోనా టీకా విషయంలో ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లు లేకుండా వలంటీర్లు విధులు నిర్వహించలేరన్నారు.