రైల్వే ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధర బాదుడు

Published: Saturday March 06, 2021

 à°°à±†à°—్యులర్‌ రైళ్ల లాక్‌ ఇంకా తెరవక ముం దే రైల్వే శాఖ ప్రయాణికులపై మరో భారం మోపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ పేరిట.. రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను ఏకంగా మూడు రెట్లకు పెం చింది. సాధారణంగా రూ.10 ఉన్న ప్లాట్‌ఫాం టికెట్‌ను శనివారం నుంచి విజయవా à°¡ రైల్వే స్టేషన్లో ఇకపై తాత్కాలికంగా రూ.30à°•à°¿ పెంచారు. స్పెషల్‌ రైళ్లన్నింటికీ ఇది వర్తిస్తుంది. విజయవాడతో పాటు డివిజన్‌ పరిధిలోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్‌, భీమవరం స్టేషన్లలో కూడా రూ.30 చెల్లించాల్సిందే.

 

చీరాల, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కాకినాడ పోర్టు, అన్నవరం, తుని, అనకాపల్లి, భీమవరం జంక్షన్‌, వేదాయపాలెం, బిట్రగుంట, కావలి, పవర్‌పేట, కొవ్వూరు, గోదావరి, అనపర్తి, పిఠాపురం, నర్సీప ట్నం, ఆకివీడు, కైకలూ రు, పెడన, మచిలీపట్నంలలో రూ.20 ప్లాట్‌ఫ్లాం టికెట్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది.