ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Published: Tuesday March 09, 2021

 à°à°ªà±€à°Žà°¸à± అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ à°Ž.à°Žà°‚.ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో విచారణ కొనసాగింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పటిలోగా విచారణ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో విచారణ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరునెలల సమయం కోరింది. అన్ని డాక్యుమెంట్‌లు  ఉన్నప్పుడు విచారణకు à°…à°‚à°¤ సమయం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. రోజు వారీ విచారణ చేపట్టి ఏప్రిల్ 30లోగా విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 3à°•à°¿ వాయిదా వేసింది.