ఏపీ జిల్లాల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లు

Published: Tuesday March 09, 2021

శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 8, విశాఖపట్నంలో 9, తూర్పు గోదావరిలో 16, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణా జిల్లాలో 12, గుంటూరులో 15, ప్రకాశంలో 11, నెల్లూరులో 8, చిత్తూరులో 12, కడపలో 9, కర్నూలులో 12, అనంతపురంలో 12 ఖాళీలు ఉన్నాయి. 

 

అర్హత వివరాలు: à°…భ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి రెండేళ్ల డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు నాటికి సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డు గుర్తింపు తప్పనిసరి. అభ్యర్థుల వయసు 2020 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు  దివ్యాంగులకు పదేళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లు; మాజీ సైనికులకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. 

ఎంపిక ప్రక్రియ: డీఎంఎల్‌à°Ÿà±€ కోర్సులో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. సమాన మార్కులు సాధించిన అభ్యర్థులకు వారి వయసు, పదోతరగతి మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు.

 

ముఖ్య సమాచారం

ఒప్పంద వ్యవధి: ఏడాది

వేతనం: నెలకు రూ.17,500

దరఖాస్తు ఫీజు: రూ.200

దరఖాస్తుతో అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలు: డీఎంఎల్‌à°Ÿà±€ సర్టిఫికెట్‌; ఏపీ పారా మెడికల్‌ బోర్డు గుర్తింపు పత్రం; నాలుగోతరగతి నుంచి పదోతరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు; కులం, వైకల్యం ధృవీకరణ పత్రాలు.

 

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 20

దరఖాస్తుల పరిశీలన: మార్చి 21 నుంచి

మెరిట్‌ జాబితా విడుదల: మార్చి 29

ధృవపత్రాల పరిశీలన: మార్చి 30, 31