పింగళి వెంకయ్యకు భారతరత్న

Published: Friday March 12, 2021

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను సత్కరించుకోవడం ఇప్పుడు సముచితమన్నారు. పింగళి వెంకయ్యకు సరైన గుర్తింపు రాలేదని లేఖలో జగన్‌ ప్రస్తావించారు. అంతకుముందు పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం సన్మానించానే. జాతీయ జెండాకు రూపకల్పన జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా à°ˆ కార్యక్రమం తలపెట్టారు.

 

 à°ªà°¿à°‚గళి వెంకయ్య ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. ఆయన 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ ఉండగానే మహాత్మాగాంధీని కలిశారు. అప్పుడు గాంధీతో ఏర్పడిన à°† సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలించింది. 

 

1916లో లక్నోలో జరిగిన భాతర జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను ఎగురవేశారు.అయితే 1919లో జలంధర్ లాలాహన్స్ రాజ్ జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించారు. ఈ అభిప్రాయాన్ని గాంధీ అంగీకరించారు. 1921లో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. గాంధీ, వెంకయ్యను సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నం గల ఓ జెండాను చిత్రించమని కోరారు. గాంధీ సూచించిన ప్రకారం ఒక జెండాను రూపొందించారు. ఈ తర్వాత వచ్చిన ఆలోచన ప్రకారం సత్యం, అహింసలకు ప్రత్యేక్ష నిదర్శనమైన తెలుపు రంగు ఉండాలని గాంధీ అభిప్రాయపడ్డారు. తర్వాత ఆ జెండాలో అదనంగా తెలుపురంగును చేర్చారు. ఇన్ని అభిప్రాయాలు, సూచనలతో నేటి త్రివరణ పతాకాన్ని వెంకయ్య ప్రసాదించారు.