కాకినాడ గేట్‌వే పోర్టులోనూఅరబిందోకు 74 శాతం షేర్‌

Published: Friday March 12, 2021

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌).. పదివేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న à°ˆ సెజ్‌ దేశంలోనే పెద్దది. ఇందులో 51 శాతం వాటా జీఎమ్మార్‌ సంస్థకు ఉండేది. అలాగే కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నిర్వాహకుడు కేవీ రావుకు 0.29శాతం, ఆయనకే చెందిన కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఐహెచ్‌పీఎల్‌)కు 33.75 శాతం, వేద ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 14.70 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇది కాకుండా 0.26 శాతం వాటా.. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనే నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థకు ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల à°•à°¿à°‚à°¦ స్వయంగా à°ˆ సంస్థలు ఇక్కడి రైతులకు పరిహారం చెల్లించి సెజ్‌ పేరిట వేల ఎకరాలు కొనుగోలు చేశాయి. అయితే à°ˆ సెజ్‌లో ప్రధాన వాటాదారైన జీఎంఆర్‌.. ఆకస్మికంగా అరబిందో రియల్టీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు తన 51 శాతం సెజ్‌ వాటాను రూ.2,610 కోట్లకు గతేడాది విక్రయించింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే సెజ్‌కు సంబంధించి మరో ఒప్పందం జరిగింది. అందులో భాగంగా కేవీ రావుకున్న 0.29 శాతం, ఆయనకే చెందిన కేఐహెచ్‌పీఎల్‌కు ఉన్న 33.75 శాతం, వేద ఇన్‌ఫ్రా-14.70 శాతం వాటాలు కలిపి మొత్తం 48.74 శాతం వాటా తాజాగా అరబిందో చేతికి వచ్చేశాయి. తద్వారా అరబిందో రియల్టీ ఇన్‌ఫ్రాకు సెజ్‌లో 99.74 శాతం వాటా దఖలుపడింది. à°ˆ ప్రక్రియ తాలూకు లావాదేవీలకు జగన్‌ ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. అయితే ఎన్ని వేల కోట్లకు అరబిందో à°ˆ వాటాలు కొనుగోలు చేసిందనేది గోప్యంగా ఉంచారు. 

..

కాకినాడ సెజ్‌లో కొత్తగా నిర్మించనున్న గేట్‌వే పోర్టు వాటాల్లోనూ మార్పులు జరిగాయి. ఇది వరకు కాకినాడ సెజ్‌కు, జీఎంఆర్‌కు గేట్‌వే పోర్టులో నూరు శాతం వాటా ఉండేది. అందులో 99.74 శాతం వాటాను అరబిందో కొనుగోలు చేయడంతో రాబోయే గేట్‌వే పోర్టులో నూరుశాతం వాటా అరంబిందోకు దఖలు పడింది. కానీ గేట్‌వే పోర్టు నిర్మాణానికి 2010లో జీఎంఆర్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సమయలో రాష్ట్రప్రభుత్వం 5.13, 5.9 పేరుతో కొన్ని ప్రత్యేక క్లాజులు తీసుకొచ్చింది. సెజ్‌లో నిర్మించబోయే పోర్టుకు 75 కిలోమీటర్ల పరిధిలో à°—à°² ఇతర ఏ ఓడరేవులోనూ 25 శాతానికి మించిన వాటాలు ఒకే సంస్థకు ఉండకూడదని అందులో  నిబంధన విధించింది. రెండు పోర్టులు ఒకే కంపెనీ చేతిలో ఉంటే గుత్తాధిపత్యానికి అవకాశం ఉంటుందని à°ˆ షరతు పెట్టింది. అలాగే గేట్‌వే పోర్టు వాటాలను భవిష్యత్‌లో ఎవరికి విక్రయించినా మూడేళ్లపాటు ప్రపోనెంట్‌à°—à°¾ జీఎంఆర్‌ ఉండాల్సిందేనని నిబంధనలు విధించారు. ఇప్పుడు అరబిందో రియల్టీకి గేట్‌వే పోర్టులో నూరు శాతం వాటా ఉండగా.. సెజ్‌ బయట ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టులో ఇటీవల 41.12 శాతం వాటా కొనుగోలు చేసింది. దరిమిలా పై నిబంధన ఇప్పుడు అడ్డంవస్తోంది. à°ˆ నేపథ్యంలో à°† క్లాజు నుంచి మినహాయింపు ఇవ్వాలని అరబిందో కోరింది. ప్రభుత్వం à°ˆ వెసులుబాటు కూడా ఇస్తూ జీవోలో ఆదేశాలు ఇచ్చింది. దీంతో 75 కిలోమీటర్ల పరిధిలో రెండు పోర్టులూ అరబిందో కైవసమైనట్లయింది. నిబంధనలు అడ్డువస్తుండడంతో తన చేతిలోని గేట్‌వే పోర్టులోని నూరు శాతం వాటాలో 74 శాతం అరబిందో తనవద్ద కాకినాడ సెజ్‌ పేరిట ఉంచుకుని.. 26 శాతం జీఎంఆర్‌ సెజ్‌ అండ్‌ పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. à°ˆ వాటాల బదిలీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.