మా జీతాలు, సమస్యల కోసం అందోళన చేయడంలేదు

Published: Monday March 15, 2021

రెండు రోజుల పాటు సమ్మె బాట పట్టిన బ్యాంకు ఉద్యోగులు సోమవారం విజయవాడ ఐదోనెంబర్ రోడ్డులోని ఎస్‌బీఐ జోనల్ బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున అందోళన చేపట్టారు. à°ˆ సందర్భంగా బ్యాంకు యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటికరణ చేస్తున్నట్లు చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ జీతాలు, సమస్యల పరిష్కారం కోసం అందోళన చేయడంలేదన్నారు. ఇది బ్యాంకు ఉద్యోగస్తుల సమస్య కాదని, ప్రజలందరి సమస్య అని.. అందుకే పోరాటం చేస్తున్నామన్నారు. వేల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులే... బ్యాంకు వద్ద అప్పులు తీసుకుని చెల్లించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే... అన్ని బ్యాంకులు లాభాల బాట పడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించక పోతే... సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరవధిక సమ్మె చేసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. తమ సమ్మెకు  ప్రజలు పూర్తి మద్దతు కావాలని యూనియన్ నాయకులు కోరారు.