12 ఏళ్లు కష్టపడి పాలపుంత ఫోటో

Published: Thursday March 18, 2021

లక్ష కాంతి సంవత్సరాల విస్తీర్ణం, 100 నుంచి 400 బిలియన్‌ నక్షత్రాల సమూహం, à°† నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, గ్రహశకలాలూ, దుమ్ము, ధూళి.. వీటన్నింటి కలయికే మన పాలపుంత నక్షత్ర మండలం. à°ˆ నక్షత్ర మండలాన్ని ఫోటో తీయాలని à°“ ఫోటోగ్రాఫర్ నిర్ణయించుకున్నాడు. అంతే దాదాపు 12 ఏళ్ల పాటు కష్టపడి, పాలపుంతను అనేక ఫోటోలు తీసి, వాటన్నింటినీ జత చేసి చివరకు మొత్తం గెలాక్సీ ఫోటోను సిద్ధం చేశాడు. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ జేపీ మెత్సవైనియో à°ˆ ఘనత సాధించాడు. 2009 నుంచి à°ˆ ఫోటో కోసం మెత్సవైనియో కష్టపడుతున్నాడు. 

 

 

దాదాపు 1,250 గంటలు కష్టపడి à°ˆ ఏడాది ఎట్టకేలకు పాలపుంత గెలాక్సీకి సంబంధించిన మొత్తం ఫోటోను సిద్ధం చేశాడు. à°ˆ ఫోటో దాదాపు లక్ష పిక్సెల్స్ వ్యాసంతో హై రిజల్యూషన్ à°—à°¿à°—à°¾ పిక్సెల్ క్లాస్ మొసాయిక్(చిన్ని చిన్న ముక్కలను కలిపిన) ఫోటోను సిద్ధం చేశాడు. దీనికోసం దాదాపు 234 మొసాయిక్ ప్యానెల్స్‌ను à°’à°•à°Ÿà°¿à°—à°¾ చేశాడు. à°ˆ ఫోటోలో దాదాపు మొత్తం పాలపుంతతో పాటు 20 మిలియన్ నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.