ఎస్‌ఈసీకి అసెంబ్లీ కార్యదర్శి లేఖ

Published: Friday March 19, 2021

తన హక్కులకు à°­à°‚à°—à°‚ కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసుపై సభాహక్కుల కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శాసనసభ లేఖ రాసింది. తదుపరి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని కూడా కోరింది. గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ ఎస్‌ఈసీ తనపై ఉపయోగించిన పదజాలం కించపరచేలా ఉందని మంత్రి పెద్దిరెడ్డి...శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఫిర్యాదు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చేశారు. à°ˆ ఫిర్యాదులను పరిశీలించాల్సిందిగా సభా హక్కుల సంఘానికి స్పీకర్‌ తమ్మినేని పంపారు. అయితే, సంఘం నిర్ణయం జాప్యమవుతోందని భావించిన మంత్రి పెద్దిరెడ్డి... మరోదఫా సభాపతికి లేఖరాశారు.

 

దీనిని కూడా సభా హక్కుల కమిటీకి స్పీకర్‌ పంపారు. బుధవారం నెల్లూరు నుంచి హక్కుల కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్దన్‌ రెడ్డి వర్చువల్‌ విధానంలో సమావేశం జరిపారు. à°ˆ సమావేశంలో .. ఎస్‌ఈసీ నుంచి వివరణతో పాటు సందేహాల నివృత్తి కోసం నేరుగా విచారణకు పిలవాలని నిర్ణయించారు. à°ˆ మేరకు ఎస్‌ఈసీకి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు కాకాణి ఆదేశించారు. అదేరోజు సంజాయిషీ కోరుతూ ఎస్‌ఈసీకి అసెంబ్లీ కార్యదర్శి లేఖను పంపారు.