బెంగాల్‌లో పాలన 50 ఏళ్ల నుంచి స్థంభించిపోయింది

Published: Saturday March 20, 2021

`నిన్న రాత్రి 50-55 నిమిషాల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోయినందుకు అందరూ ఎంతో ఆందోళన చెందారు. కానీ, బెంగాల్‌లో అభివృద్ధి, సుపరిపాలన 50-55 ఏళ్ల నుంచి ఆగిపోయింది. దీని గురించి మరింత ఆందోళన చెందాల`ని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. à°ˆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తాజాగా బంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు వచ్చారు. 

 

`మొదట కాంగ్రెస్, à°† తర్వాత లెఫ్ట్, ప్రస్తుతం తృ‌ణమూల్.. బెంగాల్‌లో అభివృద్ధిని నిలిపివేశాయి. `ఆయుష్మాన్ భారత్` పథకం à°•à°¿à°‚à°¦ ఉచిత వైద్య చికిత్స తమకెందుకు దక్కడం లేదని బెంగాల్‌లోని పేదలు అడుగుతున్నారు. `కిషాన్ సమ్మన్ నిథి` నుంచి తన ఖాతాలోకి వేల రూపాయలు ఎందుకు రావడం లేదని బెంగాల్ పేద రైతు అడుగుతున్నాడు. మమతా బెనర్జీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నార`ని మోదీ విమర్శించారు.