పంటలకు నిప్పు ;గుంటూరు

Published: Monday March 22, 2021

 à°µà°¿à°¨à±à°•à±Šà°‚à°¡ నియోజకవర్గంలో కొందరు రైతులను టార్గెట్ చేస్తూ.. పంటలను తగలబెట్టడం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టారు. నూజెండ్ల మండలం, ములకలూరులో మందా వెంకటేష్ అనే రైతు రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిరపపంట సాగు చేశాడు. అప్పులు చేసి మరీ పంట పండించాడు. పంట బాగా రావడంతో తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు. తొలి కోతలోనే 30 క్వింటాల వరకు పంట వచ్చింది. కోసిన మిరప పంటను పొలంలోనే ఆరబోసాడు. క్వింటాను రూ. 14,500లకు కొనేందుకు కొందరు వ్యాపారులు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీంతో ప్రత్యర్థులు రైతుపై ఈర్ష్య పెంచుకున్నారు. పాత కక్ష్యలను మనసులో పెట్టుకుని మిర్చి పంటకు నిప్పు పెట్టారు. పంట మొత్తం తగలబడింది. à°ˆ ఘటనతో రైతు వెంకష్ కుటుంబం కుంగిపోయింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. 

 

అలాగే నరగాయ పాలెంలో మరో పంట చేనుకు నిప్పు పెట్టారు. రైతు ఎర్రంరెడ్డి అంజిరెడ్డికి చెందిన 9 ఎకరాలు జామాయిల్ తోటకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తోట పూర్తిగా తగలబడిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. పాత కక్ష్యలతోనే రైతుల పంటలను దగ్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానితుల వివరాలను బాధిత రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.