వికటించిన వ్యాక్సిన్

Published: Thursday April 01, 2021

నగరానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షా నవాజ్ ఖాసీం భార్య హీనాకు కోవిడ్ వ్యాక్సిన్ వికటించింది. కింగ్ కోఠీలోని ఏరియా ఆస్పత్రిలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న హీనాను పరామర్శించి.. ఆమె పరిస్థితి, వైద్య సేవలపై ఆరాతీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.