నిమ్మగడ్డ, సాహ్నిలది విన్‌-విన్‌ స్థితి

Published: Thursday April 01, 2021

పాలనాపరమైన ఎత్తులు, జిత్తులు...న్యాయపరమైన చిక్కుముడులు...సంచలన తీర్పులు...ఉద్వాసనలు...ఆపై చేర్పులు... మరో మహాభినిష్క్రమణం...ఇలా à°’à°•à°Ÿà°¾, రెండా! అయితే, అవన్నీ దాదాపు ఏడాదిపాటు ఆంధ్రప్రదేశ్‌ను ఒకే ఒక్క అంశం చుట్టూ కట్టిపడేశాయి. అదే ఎన్నికల కమిషన్‌ వ్యవహారం. 

మొత్తం ఎపిసోడ్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. బుధవారం ఆయన పదవీ విరమణ చేశారు. à°…à°–à°¿à°² భారత సర్వీసులో 1982 బ్యాచ్‌కు చెందిన రమేశ్‌కుమార్‌ గురించి ఏ కొద్దిమందికో మాత్రమే తెలుసు. ఆయన పదవీకాలం మొత్తంమీద ఎక్కడా చెమక్కులు చూపింది లేదు. సంచలనాలు సృష్టించింది లేదు. సాదాసీదాగా సాగిపోయిన ఉద్యోగజీవితం చివరి ఏడాది మాత్రం పుల్‌జో్‌షలో కొనసాగింది. ఐదేళ్ల కిందటే ఐఏఎ్‌సగా పదవి విరమణ చేసిన రమేశ్‌కుమార్‌... అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ చొరవతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అయ్యారు. అప్పటి నుంచి à°† పోస్టులో ఆయన చేసింది, చేయగలిగింది కూడా ఏమీ లేకపోయింది. తన ఐదేళ్ల పదవీకాలంలో ఒక్క ఎన్నికయినా నిర్వహించకపోతే అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుందని భావించిన రమేశ్‌కుమార్‌... స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల ప్రక్రియ మధ్యకు వచ్చేసరికి రాష్ట్రంలో రాజకీయ వివాదాలు పేట్రేగిపోయాయి. దాడులు, కిడ్నా్‌పలు, బలవంతపు ఏకగ్రీవాలు...ఒకటేమిటి అన్నీ ముంచుకొచ్చాయి. à°ˆ దారుణాలు ఆపాలని విపక్షాలు గగ్గోలుపెట్టాయి. అనుకోకుండా కరోనా ఉధృతి మొదలుకావడంతో రమేశ్‌కుమార్‌ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

à°† ఒక్క నిర్ణయమే ఆయనను కొత్తమార్గంలోకి తీసుకువెళ్లింది. ఎప్పుడూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని జగన్మోహన్‌రెడ్డి... రెండుమూడు à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే హుటాహుటిన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. ఇక అక్కడి నుంచి మొదలైన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు అనేకమలుపులు తిరిగాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో డజన్లకొద్ది కేసులు నమోదయ్యాయి. రమేశ్‌కుమార్‌తో వేగలేం అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించారు. సీఎస్‌ హోదాలో పదవీ విరమణ చేసిన వారికి à°ˆ పోస్టు ఇవ్వాలన్న నిబంధనను కూడా సవరించి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలను కూడా à°ˆ పోస్టుకు అర్హులుగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. రాత్రికి రాత్రే ఆర్డినెన్స్‌ రావడం, తెల్లారేసరికి రమేశ్‌కుమార్‌కు ఉద్వాసన, మరుక్షణంలోనే లాక్‌డౌన్‌ సైతం పక్కకుపోయి చెన్నై నుంచి జస్టిస్‌ కనగరాజ్‌ విజయవాడలో ప్రత్యక్షమవ్వడం à°šà°•à°šà°•à°¾ జరిగిపోయాయి. 

ఆర్డినెన్స్‌కు లోబడి జస్టిస్‌ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌à°—à°¾ ప్రభుత్వం నియమించింది. రెండు మూడు à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే, అది నెలరోజుల ముచ్చటే అయింది. హైకోర్టు  రమేశ్‌కుమార్‌ను తిరిగి కొనసాగించాలని ఆదేశించింది.  వాస్తవానికి ఎన్నికల కమిషనర్‌à°—à°¾ ఏ అర్హతలు కలిగిన వారు ఉండాలి. పదవీకాలం à°Žà°‚à°¤...అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు. కానీ, అప్పటికే à°’à°• కమిషనర్‌ సర్వీసులో ఉండగా పదవీకాలాన్ని కుదించి మధ్యలోనే దిగిపొమ్మనడం న్యాయపరంగా చెల్లదని అర్ధంకావడంతో రాష్ట్ర ప్రభుత్వం కిక్కురుమనకుండా రమేశ్‌కుమార్‌ను పునర్నియమించింది. అయితే, ప్రభుత్వ పెద్దల మనసులో ఏముందో ఏమోకానీ జస్టిస్‌ కనగరాజ్‌ను విజయవాడలోనే ఉంచేశారు.

 

విజయవాడ బెంజిసర్కిల్‌లో à°’à°• విశాలమైన అపార్ట్‌మెంట్‌ను ఆయనకోసం తీసుకొని చాలా కాలంపాటు ఆయనను అక్కడే కొనసాగించారు. ఆయనకు న్యాయం చేయాలి అని ప్రభుత్వం అనుకొని ఉంటే పాత ఆర్డినెన్స్‌కు జీవంపోసి ఉండవచ్చు. అప్పటికప్పుడు రమేశ్‌కుమార్‌ని తొలగించడం కోసమే ఆర్డినెన్స్‌ తెచ్చారనే విమర్శలు వచ్చినందున ఆయన పదవీకాలం ముగిశాక తదుపరి నియామకం మూడేళ్లకే ఉంటుందని,  హైకోర్టు జడ్జి కూడా ఉండొచ్చని ఆర్డినెన్స్‌లో మార్పులు తెచ్చి తిరిగి జారీ చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోలేదు. కనగరాజ్‌ను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. చాలా కాలం పాటు విజయవాడలోనే ఉన్న ఆయన చివరకు చెన్నై వెళ్లిపోయారు. ఆయన ఇంటికి ప్రభుత్వం ఇప్పటికీ అద్దె  చెల్లించలేదని తెలుస్తోంది. 

రమేశ్‌కుమార్‌ స్థానంలో ఎన్నికల కమిషనర్‌à°—à°¾ బాధ్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని డబుల్‌ హ్యాపీ. ఆమెది సేమ్‌టు సేమ్‌ పరిస్థితి. ఏపీ కేడర్‌కు చెందినప్పటికీ ఆమె గురించి తెలిసింది తక్కువే. అనూహ్య పరిణామాల్లో ఆమెను చీఫ్‌ సెక్రెటరీ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను తూచాతప్పకుండా అమలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా పదవీ విమరణ తర్వాత  ఆరు నెలల పాటు కొనసాగింపు ఇచ్చారు. à°† తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారును చేశారు. తాజాగా ఐదేళ్లపాటు స్థిరంగా ఉండే రాజ్యాంగబద్ధ సంస్థకు అధిపతిగా నియమించారు.