మూడు నెలల కిందట అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ

Published: Saturday April 03, 2021

 à°—à°¤ ఏడాది చివర, à°ˆ ఏడాది ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేపట్టింది. సుమారు 15 రోజులపాటు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించి పట్టాలు పంపిణీ చేసింది. కానీ à°ˆ స్థలాల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.  పంట పొలాలు, పల్లపు భూములను కొనుగోలు చేసిన ప్రభుత్వం స్థలాలకు మెరకలు వేయకుండానే హద్దురాళ్లు వేసి పట్టాలు పంపిణీ చేసింది. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షా 80వేలు ఇంటి నిర్మాణాలకు చాలవని లబ్ధిదారులు చాలామంది ఇల్లు కట్టుకునేందుకు ముందుకురావటంలేదు. తెనాలి పట్టణంలోని పేదలతో పాటు రూరల్‌ మండల గ్రామాల్లోని 23,500 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 525 ఎకరాలు సేకరించారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి పట్టాలు అందజేశారు. పెదరావూరు, సిరిపురం, గోలిడొంక ప్రాంతాల్లో సేకరించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. అమృతలూరు మండలం కేజీపాలెంలో డొంక భూమిని ఇళ్ల స్ధలాలకు కేటాయించగా దీనిపై స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో 28 మందికి పట్టాలు పంపిణీ చేయలేదు.

 

- కొల్లూరు మండలం దోనేపూడిలో కొంతమంది లబ్దిదారులు ఇళ్లపట్టాలు తీసుకునేందుకు నిరాకరించారు. మరికొన్ని చోట్ల ఇళ్లపట్టాలు పంపిణీ చేసినా కేటాయించిన స్థలాలు చూపించలేదు. ఈపూరులంక, చిలుమూరు తదితర గ్రామాల్లోని ఇళ్ల స్థలాలు కేటాయించిన భూముల్లో మెరకల కోసం అవసరమైన బుసక, మట్టిని తోలడంలో జాప్యం జరుగుతోంది. 

 

-  నిడుబ్రోలులోని జగనన్ననగర్‌లో 99ఎకరాల్లో 4,068 మంది నిరుపేదలకు నివేశన స్థలాలు మంజూరు చేశారు. పట్టణానికి చెందిన నలుగురు లబ్ధిదారులు మాత్రవే గృహనిర్మాణాలు ప్రారంభించారు. నివేశన స్థలాలు పంపిణీ చేసి మూడు నెలలుగడుస్తున్నా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మెరక వేయడమే ఇంకా ప్రారంభం కాలేదు.

 

- బాపట్ల పట్టణంలోని బేతనీకాలనీ, మూలపాలెంరోడ్డు, ప్యాడిసన్‌పేట ప్రాంతాల్లో మొత్తం 3,576 పట్టాలిచ్చారు. అక్కడ కావాల్సిన మౌలికవసతులు కల్పించలేదు. బాపట్ల మండలంలో 44 లేఅవుట్‌à°² ద్వారా 2,945 మందికి పట్టాలిచ్చారు. స్థలాలు సరిగ్గా లేవని మూలపాలెం, పిన్నిబోయినవారిపాలెం, వెదుళ్ళపల్లి, అడవి, వెస్ట్‌బాపట్ల, పూండ్లలో పలువురు కోర్టుకు వెళ్ళారు. దీంతో à°† ప్రాంతాలలో పట్టాలు పంపిణి జరగలేదు. 

 

- మాచర్ల నియోజవకర్గంలో పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చారు.. రిజిస్ట్రేషన్‌ చేపించి ఇస్తామని మరలా వెనక్కు తీసుకున్నారు.. మూడు మాసాలు గడిచింది. ఇప్పటి వరకు à°† పట్టాలు లబ్ధిదారునికి చేరింది లేదు. పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రెంటగుట్ట అనే ప్రాంతంలో లేఅవుట్‌ వేశారు.  à°† ప్రాంతానికి వెళ్లేందుకు రహదారి కూడా లేదు. అయినప్పటికీ అక్కడ సుమారు 1,050 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. అక్కడి లబ్ధిదారులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సాయిబాబా స్కూల్‌ వెనుక నాలుగు కిలోమీటర్ల ఆవల ఇచ్చిన స్థలంపై ఏడోవార్డు ప్రజలు పెదవి విరుస్తున్నారు. 

 à°« గురజాల నియోజకవర్గ పరిధిలో 22 వేల ఇళ్ల్లపట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే నేటికి సగానికి పైగా లబ్ధిదారుల చేతికి అందలేదు. జియోట్యాగింగ్‌ కూడా చురుగ్గా సాగడం లేదు. లాటరీ ద్వారా పట్టాలు కేటాయించాల్సిన అధికారులు వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో ఇష్టారాజ్యంగా కేటాయించారనే విమర్శలు కూడా వచ్చాయి.సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కోర్టు స్టే కారణంగా ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు.