160 మంది వైద్యుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

Published: Monday April 05, 2021

వైద్యుల సీనియార్టీ జాబితా విషయంలో డీఎంఈ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను గాలికొదిలి వైద్యుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. 2014లో అప్పటి డీఎంఈ చేసిన తప్పులకు వత్తాసు పలుకుతూ 160మంది వైద్యుల జీవితాలను బలి చేస్తున్నారు. కోర్టు తీర్పులను సైతం పట్టించుకోకుండా కేవలం చిన్న మెమో ఆధారంగా సీనియార్టీని నిర్ణయించడంపై విమర్శలొస్తున్నాయి. ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ నియామకాలు ఒకేసారి చేపట్టాల్సి ఉంది. అయితే 2014లో అప్పటి డీఎంఈ తొలుత లేటరల్‌ ఎంట్రీ ద్వారా 160మంది వైద్యులను నియమించుకున్నారు. à°† తర్వాత 2015 జూన్‌లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టారు. à°ˆ రెండు బ్యాచ్‌à°² మధ్య 9నెలల వ్యత్యాసం ఉంది. లేటరల్‌ ఎంట్రీ వైద్యులు సర్వీసులో చేరిన 9నెలల తర్వాత డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వైద్యులు చేరారు. కానీ ప్రస్తుతం అధికారులు మాత్రం 2015లో చేరినవారికి సీనియార్టీ జాబితాలో ప్రాధాన్యం కల్పిస్తూ 2014 బ్యాచ్‌ను వెనక్కి నెట్టేశారు. సీనియార్టీ లిస్ట్‌లో వీరినే ముందు పెడతామని అప్పటి డీఎంఈ వారికిచ్చిన పోస్టింగ్‌ అర్డర్‌లో పొందుపరుస్తూ à°’à°• చిన్న మెమో ఇచ్చారు. దాని ఆధారంగా డీఎంఈ అధికారులు అడ్డగోలుగా సీనియార్టీ లిస్ట్‌ సిద్ధంచేసి మూ డు రోజుల క్రితం వెబ్‌సైట్‌లో ఉంచారు. సీసీఏ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు సీనియార్టీ సిద్ధం చేసేటప్పుడు వారి నియామకం సమయంలో ఇచ్చిన జీఓ ఆధారంగా చేసుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదేవిధంగా ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తుంటారు. ఆరోగ్యశాఖలో సైతం జీఓ.154, 320, 32 ప్రకారం సీనియార్టీ లిస్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. డీఎంఈలో ఏళ్ల తరబడి వైద్యుల సీనియార్టీ, ప్రమోషన్లు à°ˆ మూడు జీఓల ఆధారంగానే ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం కీలకమైన à°ˆ జీఓలను పాటించకుండా, సీనియార్టీ లిస్ట్‌ సిద్ధం చేసేశారని పలువురు వైద్యులు మండిపడుతున్నారు. 

 

డీఎంఈ విభాగంలో వైద్యుల సీనియార్టీ లిస్ట్‌ విషయంలో అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. సర్వీసులో మొదట చేరినవారినే సీనియర్లుగా పరిగణించాలని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పాయి. 2010లో డాక్టర్‌ జయభాస్కర్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ, 2017లో డీఎంఈ నియామకంలోనూ సర్వీసులో చేరిన తేదీని ఆధారంగా తీసుకునే సీనియార్టీ నిర్ణయించాలని కోర్టులు స్పష్టం చేశాయి. వీటిని అధికారులు బేఖాతరు చేస్తూ, తాము అనుకున్నవారిని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారు. సీనియార్టీ లిస్ట్‌ సిద్ధంచేసే విషయంలో రూ.కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. డీఎంఈలో సిబ్బంది ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిని కప్పిపుచ్చుకోవడానికి సీఎంఓ పేరును తెరపైకి తెచ్చారు. సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతోనే 2015 బ్యాచ్‌కు సీనియార్టీ లిస్ట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని చెబుతున్నారు.

 

రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీల్లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) 2014లో తనిఖీలు నిర్వహించింది. అప్పట్లో చాలా కాలేజీల్లో వైద్యసిబ్బంది కొరత అధికంగా ఉంది. à°† లోటును భర్తీ చేసేందుకు అప్పటికప్పుడు లేటరల్‌ ఎంట్రీ ద్వారా 160మందిని నియమించుకున్నారు. తనిఖీల సమయంలో à°ˆ వైద్యులందరినీ ఫ్యాకల్టీగా చూపించడంతో కొన్ని వందల ఎంబీబీఎస్‌ సీట్లు నిలబడ్డాయి. అప్పుడు ఎంసీఐ కోసమని హడావిడిగా నియామకాలు చేసుకున్నారు. తర్వాత వారి అవసరం లేదని వదిలించుకొనే ప్రయత్నం చేస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. దీనిపై ఎవరైనా ఎంసీఐకి గానీ జాతీయ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)కు గానీ ఫిర్యాదు చేస్తే పాత అధికారుల నుంచి ఇప్పుడున్న ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వరకూ అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.