సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి

Published: Monday April 05, 2021

ఉక్కు ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర ప్రజలతోపాటు, కవులు, కళాకారులను  చైతన్యపరచటానికి తమ వంతు కృషి చేస్తామని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో 52 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. à°ˆ దీక్షలలో ఆదివారం ట్రాఫిక్‌, కన్‌స్ట్రక్షన్‌, డీఈ, సేఫ్టీ, ఎస్‌టీఈడీ, వర్క్స్‌ కన్‌స్ట్రక్షన్‌ విభాగాలకుచెందిన 400 మంది కార్మికులు కూర్చున్నారు. à°ˆ శిబిరంలో తెలకపల్లి రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌ ప్రీతి మాట్లాడుతూ  జాతీయ సంపదను పరిరక్షించుకోవటానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.  సాహితీ స్రవంతి విజయనగరం అధ్యక్షురాలు చంద్రికా రాణి మాట్లాడుతూ గుజరాత్‌లో పలు ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలు దివాలా తీసినా వాటిని ప్రైవేటీకరించకుండా, ఆంధ్రాపైనే ఎందుకు దృష్టి పెట్టారని ప్రశ్నించారు. 

విదేశీయులకు కట్టబెడితే సహించేది లేదు

రిటైర్డు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి, గాంధీ వేషధారి తిరుపతయ్య(అనంతపురం) మాట్లాడుతూ జాతి సంపదైన ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం విదేశీయులకు కట్టబెడితే సహించేది లేదని అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు వరసాల శ్రీనివాసరావు, కె.సత్యనారాయణలు మాట్లాడుతూ à°ˆ రోజు ప్రధాని మోదీ వైఖరి చూస్తే ప్రభుత్వ రంగాలను అమ్మటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉందన్నారు.  à°ˆ దీక్షలలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్‌, à°¡à°¿.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, యు.రామస్వామి, ఎన్‌.రామారావు, కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు, వైటీ దాస్‌, బోసుబాబు, అప్పారావు, మస్తానప్ప, విళ్లా రామ్మోహన్‌. గణపతి రెడ్డి, సురేశ్‌బాబు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.