మావోల గురించి షాకింగ్ విషయాలు

Published: Tuesday April 06, 2021

‘‘వాళ్లు అంతా పొడవుగా ఉన్నారు సార్‌..! వారిపై ఫైర్‌ చేస్తున్నా.. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించి.. జంకు లేకుండా నిలబడ్డారు..! ఏ ఒక్కరూ పొట్టిగా కనిపించలేదు..! అంతా బలంగా ఉన్నారు..! భారీ కసరత్తు, శిక్షణ తీసుకున్న వారిలా కనిపించారు. అలాంటి వారిని మావోయిస్టుల్లో ఎన్నడూ చూడలేదు.’’.. à°‡à°¦à±€ ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి, బీజాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న à°“ జవాన్‌ అన్న మాటలు..! ఉన్నతాధికారులు సైతం à°ˆ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. దీన్ని బట్టి.. మావోయిస్టులు à°ˆ ఆపరేషన్‌ కోసం దృఢకాయులనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

ప్రత్యేకించి, ఆదివారం నాటి ఎదురుకాల్పుల్లో.. మావోయిస్టు దళంలోని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) దళాలు పాల్గొన్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు పీఎల్‌జీఏ ఒకటో బెటాలియన్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతను తన దళంలో రిక్రూట్మెంట్ల సమయంలోనే ఎత్తుగా, బలంగా ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధ విద్యలతోపాటు.. శారీరక వ్యాయామాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. క్షతగాత్రుల వద్దకు వారు కొండలు, గుట్టలు, అడవుల నుంచి పరుగెత్తుకొచ్చిన తీరును బట్టి.. ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

‘‘మాకు వాళ్లు అతి దగ్గరగా వచ్చారు. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరిపినా.. వాళ్లకు చిన్న గాయం కూడా కాలేదు. ముఖంలో భయం కనిపించలేదు. అంతా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించారు’’ à°…ని మరో జవాను చెప్పడాన్ని బట్టి పీఎల్‌జీఏ దళాలు ప్రత్యక్ష యుద్ధానికి అవసరమైన శిక్షణ తీసుకున్నట్లు అర్థమవుతోంది.

 

‘‘మావోయిస్టుల్లో అలాంటివాళ్లను ఇంతవరకు చూడలేదు. చూడడానికే రాక్షసుల్లా కనిపించారు. ఇంతకుముందు కూంబింగ్‌లలో మావోయిస్టులు తారసపడ్డా బక్కచిక్కి కనిపించారు. ఆదివారం నాటి ఘటనలో మావోయిస్టులు భిన్నంగా ఉన్నారు’’ à°…ని à°† జవాను వెల్లడించారు.