ఏపీకి వాతావరణ సూచన

Published: Wednesday April 07, 2021

 రాబోయే మూడు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ సూచనలను ఆ శాఖ విడుదల చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఈ రోజు  ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 30-40  కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

 

అలాగే దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు, ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉందని వాతావరణ కేంద్రం  తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే  అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.