సామాగ్రిని కేంద్రాలకు తరలివస్తున్న సిబ్బంది

Published: Wednesday April 07, 2021

పోలింగ్‌ సామాగ్రిని సిబ్బంది కేంద్రాలకు తరలివస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో రిపోర్టు చేయాలని జిల్లా అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో వివిధ జిల్లాల్లో  డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వస్తున్న సిబ్బందిలో అయోమయం నెలకొంది. పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ తదనంతర ప్రక్రియపై నిన్న సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చింది. అయితే సింగిల్‌ జడ్జి తీర్పును ఎస్‌ఈసీ డివిజనల్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. నిన్న వేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌‌పై బుధవారం విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పు కోసం ఉన్నతాధికారులు ఎదురుచూస్తున్నారు.