రాష్ట్రంలో ఉన్మాద, మాఫియా పాలన

Published: Friday April 09, 2021

రెండేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసింది గోరంత.. దోచింది కొండంత అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్మాద, మాఫియా, అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి శ్రీకాళహస్తిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. పదవుల కోసం à°ˆ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరేందుకు తాను రాలేదని, à°ˆ ఎన్నిక ద్వారా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని ప్రజలను అడిగేందుకే వచ్చానన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడింది టీడీపీ మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. ‘రాముడి తల తీసేసిన వాళ్లను పట్టుకోకుండా.. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన నాపై కేసులు పెడతారా? వీళ్లకు ఎందుకంత కండకావరం? కుప్పంలో దేవుడిని తీసుకొచ్చి బయటపడేశారు. దానిపై ప్రశ్నించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. స్థానిక ఎన్నికల్లో బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారు. ప్రశ్నించేందుకు వెళ్లిన నన్ను ఎయిర్‌పోర్టులో 10 గంటలు నిలబెట్టారు. నేను అధికారంలో ఉన్నప్పుడు తలుచుకుని ఉంటే వైసీపీ నాయకులు బయట తిరిగేవారా? మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మీ పరిస్థితేంటి? ఇనాళ్లూ నా మంచితనాన్నే చూశారు. ఇకపై నా కఠినమైన నిర్ణయాలు చూస్తారు. ఖబడ్దార్‌’ అని హెచ్చరించారు. 

రాష్ట్రంలో వైన్‌ షాపులన్నీ జగన్మోహన్‌రెడ్డివేనని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఇక్కడే దొరుకుతున్నాయని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ‘ఇసుక దొంగతనంగా చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారు. వైపీపీ నేతలు ఎక్కడికక్కడ దోచుకుంటునే ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై విచారణ జరిపించే దమ్ము జగన్‌కుందా’ అని సవాల్‌ విసిరారు. సంపద సృష్టించకుండా అప్పులు చేసుకుంటూ పోవడం భవిష్యత్‌ తరాలను కష్టాలోకి నెట్టేయడమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వేజోన్‌, ప్రత్యేక ప్యాకేజీలపై ఇంత వరకు జగన్‌ ఎందుకు నోరుమెదపడం లేదో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పనబాక లక్ష్మి ఎంతో అనుభవజ్ఞురాలని, సమస్యలపై పోరాటం చేసే సత్తా కలిగిన వ్యక్తి అని తెలిపారు. తెలంగాణలో à°Žà°•à°°à°¾ స్థలం అమ్మితే ఏపీలో రెండెకరాలు కొనొచ్చంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యను అభినందిస్తున్నానన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో à°† పరిస్థితి లేదన్నారు. ‘ఇవాళ జగన్‌ మాట్లాడితే ఇంగ్లీషు అంటున్నాడు. పిల్లలు చదువుకునే పరిస్థితులు ఉన్నాయా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తోందా? ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి’ అని చంద్రబాబు విమర్శించారు.