జోరుగా రిగ్గింగ్‌.. రెచ్చిపోయి దాడులు

Published: Friday April 09, 2021

పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఉదయం నుంచే à°† పార్టీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ కర్రలతో దాడులు, రాళ్లు రువ్వుకోవడం, బ్యాలెట్‌ బాక్సుల అపహరణ, వాటిలో నీళ్లు పోయడం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికలను టీడీపీ బహిష్కరించినప్పటికీ చాలాచోట్ల à°† పార్టీకి చెందిన వ్యక్తులు బరి నుంచి తప్పుకోలేదు. జనసేన, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. అయితే తమకు ఎవరూ ఎదురు నిలబడకూడదన్న అధికార పార్టీ నేతల ధోరణి ముందు పలుచోట్ల పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. సిబ్బంది కొరత పేరుతో క్షేత్రస్థాయిలో కుమ్మక్కై ఫ్యానుకు వత్తాసు పలికారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నాయకుడు చిలకం మధుసూధన్‌ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గాలు దాడికి దిగాయి. వెంకట తిమ్మాపురంలో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి కల్పన తరపు ఏజెంట్‌ నారాయణస్వామిపై ఇంట్లోంచి లాక్కెళ్లి దాడిచేశారు. వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి జీపులోనే నారాయణస్వామిని ఎత్తుకెళ్లారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని టీడీపీ, బీజేపీ, జనసేన ఆందోళన చేశాయి. వైసీపీకి చెందిన à°’à°• వైద్యుడు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది.

 

గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రెండుచోట్ల ఘర్షణ జరిగింది. గారపాడులో దాడులు జరగ్గా ఉయ్యందనలో టీడీపీ ఆందోళనకు దిగింది. కంకలగుంటలో వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతంలోనూ వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ జనసేన-బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కృష్ణా జిల్లాలో à°’à°• వృద్ధురాలి ఓటు విషయంలో తలెత్తిన వివాదర  ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఓటు వేసేందుకు ఇబ్బంది పడుతున్న వృద్ధులు, వికలాంగులను పోలింగ్‌ బూత్‌లలోకి మోసుకెళ్లారు. చిన్నపిల్లలతో వెళ్లిన బాలింతలు, గర్భవతులకు సేవలు చేశారు. 

 

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ముంపు మండలాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌లో న్యాయం జరగలేదంటూ ఏలేరుపాడు మండలం తూటుకూరుగొమ్మి వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కీళంబాకం పంచాయతీ ఓటర్లు పరిషత్‌ఎన్నికలను బహిష్కరించారు. అలాగే తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడాన్ని నిరసిస్తూ రామకుప్పం మండలం రామాపురం తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. 10రోజుల్లో ప్రత్యేక పంచాయతీగా ప్రకటిస్తామని ఎంపీ రెడ్డప్ప హామీ ఇవ్వడంతో సాయంత్రం 4 గంటలకు ఓటేశారు. ఐరాల మండలం కాకర్లవారిపల్లె వాసులు ఎన్నికలను బహిష్కరించారు. నెల్లూరు జిల్లా చెంబునిపాళెం గ్రామస్థులు కుల ధ్రువీకరణ సమస్యకు వ్యతిరేకంగా ఎన్నికలు బహిష్కరించారు. బోగోలు మండలం తెల్లగుంటలో తాగునీటి సమస్యపై ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు.. ఆర్డీవో హామీతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పంచాయతీలను విభజించకపోవడాన్ని నిరసిస్తూ à°•à°¡à°ª జిల్లాలో గండికోట ముంపు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.