దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం

Published: Sunday April 11, 2021

విశాఖ: దువ్వాడ సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పూజ స్క్రాప్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ట్రాన్స్‌ఫార్మర్స్‌ను రిపేర్ చేస్తుంటారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.