ఇంటింటికీ పంపిణీ చేస్తున్నా.. ఆగని అక్రమాలు

Published: Wednesday April 14, 2021

రేషన్‌ బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నా.. అక్రమాలు ఆగడం లేదు. ప్రభుత్వ వాహనం నుంచే ప్రైవేటు వాహనంలోకి మళ్లించేసి అక్రమార్గం పట్టిస్తున్న వ్యవహారం గుంటూరులో సోమవారం రాత్రి వెలుగుచూసింది. వట్టచెరుకూరు మం డలం ముట్లూరులో రేషన్‌ బియ్యాన్ని మూడు వాహనాల్లో తీసుకువచ్చి, ఊరిబయట ఉన్న మినీ ట్రక్కులోకి ఎక్కిస్తుండటాన్ని గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు లు అక్కడకు వచ్చి వాహనాలను, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే తెల్లవారేసరికి ప్రభుత్వ పంపిణీ వాహనాలను à°°à°‚à°—à°‚ నుంచి తప్పించేశారు.

 

అయితే పట్టుబడిన వాహనాలను గ్రామస్థులు అప్పటికే ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారి జోక్యంతో స్థానిక పోలీసులు మంగళవారం సాయంత్రానికి రేషన్‌ మాఫియాకు చెందిన చుండూరి రామకోటయ్య, రేషన్‌ వాహనాల డ్రైవర్లు ఆకుల సాంబశివరావు, కొచ్చర్ల నరేంద్ర, వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేశారు.