చెప్పుతో కొట్టుకున్న ‘జై భీమ్‌’ నాయకుడు

Published: Thursday April 15, 2021

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరిట ఏర్పాటు చేసిన ‘అంబేడ్కర్‌ విదేశీ విద్య’ పథకానికి సీఎం జగన్‌ తూట్లు పొడుస్తున్నారని దళిత వర్గాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేడ్కర్‌ 130à°µ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ‘జై భీమ్‌’ సంస్థ జిల్లా అధ్యక్షుడు బీకేఎస్‌ ఆనంద్‌ నేతృత్వంలో దళితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. à°ˆ సందర్భంగా సీఎం జగన్‌ అనుసరిస్తున్న విధానాలపై ఆనంద్‌ నిప్పులు చెరిగారు. ‘‘నేను ఉన్నాను..

 

నేను విన్నాను.. అన్నావ్‌! à°ˆ రోజు మా ఆశలను, ఆశయాలను అడియాశలు చేశావ్‌. ఒక్క చాన్స్‌ అని అడిగావ్‌.. ఇచ్చినందుకు ప్రతిఫలంగా మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం’’ అంటూ అక్కడే తన చెప్పుతో ఆనంద్‌ తలపై బాదుకుని నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విదేశీ ఉన్నత విద్య పథకంపై సీఎం జగన్‌ ఉక్కుపాదం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే.. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల ఆత్మహత్యలు జరుగుతాయని హెచ్చరించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన పిల్లలకు ఫీజులు చెల్లించాలని ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. à°—à°¤ సీఎం చంద్రబాబు పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో అంబేడ్కర్‌ విదేశీ విద్యను ప్రవేశ పెట్టారని, జగన్‌ దీనిని రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాగా, ఆనంద్‌ చెప్పుతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులుగానీ, అధికారులుగానీ స్పందించకుండా అటు నుంచి అటే వెళ్లిపోవడంతో దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.