సోనూసూద్‌కి కరోనా

Published: Saturday April 17, 2021

కరోనా కల్లోలంలో ఔదార్యం కనబర్చుతూ రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్న ప్రముఖ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. తనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందంటూ స్వయంగా ఆయన ట్విటర్లో వెల్లడించారు. ‘‘అందరికీ హాయ్... ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది.  ముందస్తు జాగ్రత్తలో భాగంగా నేను ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అయితే à°ˆ విషయమై ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ  సమస్యలను పరిష్కరించేందుకు à°ˆ సమయం నాకు మరింత అవకాశం ఇస్తుంది. మీ అందరి కోసం ఎల్లప్పుడూ నేను ఉన్నానని మర్చిపోకండి..’’ అని తన అభిమానులను ఉద్దేశించి సోనూ సూద్ పేర్కొన్నారు.

 

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆయన అనేకమంది వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు విస్తృతంగా చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో చిక్కుకున్న ఎంతో మందికి ఆయన à°…à°‚à°¡à°—à°¾ నిలిచారు. కాగా ప్రస్తుతం సోనూ సూద్ ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. కరోనా బారి నుంచి  ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా ప్రార్థనలు చేస్తున్నారు. à°ˆ నెల 7à°¨ అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ‘సంజీవని’ని ప్రారంభించిన సోనూసూద్... à°ˆ సందర్భంగా కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.