‘విద్యా కానుక’లో గోల్‌మాల్‌!

Published: Saturday April 17, 2021

జగనన్న విద్యా కానుక’లో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. à°ˆ పథకం తొలి దశలో దాదాపు రూ.16కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయంలోనే à°—à°¤ ఎస్‌పీడీ చినవీరభద్రుడు, అడిషనల్‌ ఎస్‌పీడీ మధుసూదన్‌రెడ్డి కనుసన్నల్లో à°ˆ అవినీతి బాగోతం సాగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా కానుక కిట్లలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రస్తుత స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి తాజాగా సీఎం జగన్‌కు మెయిల్‌ చేయడంతో గుట్టురట్టయింది. విద్యాకానుక కిట్లకు సంబంధించిన వివిధ వస్తువుల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ నుంచి వాటిని పాఠశాలలకు సరఫరా చేయడం, బిల్లుల చెల్లింపుల వరకు పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 

నాణ్యత లేని, నాసిరకం వస్తువులను మార్కెట్‌ ధర కన్నా అధిక రేట్లకు కొనుగోలు చేసేలా టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. తమవారికి టెండర్లు కట్టబెట్టేందుకు షరతులు, నిబంధనల్లో మార్పులు చేయడం నుంచే కుంభకోణానికి తెరలేపినట్లు సమాచారం. పాఠశాలలకు నాసిరకం వస్తువులు సరఫరా చేసినట్లు, కొన్ని జిల్లాలకు తక్కువగా, పలు జిల్లాలకు డిమాండ్‌కు మించి కిట్లు పంపిణీ చేసినట్లు తెలిసింది. 

 

నిబంధనలకు నీళ్లు

విద్యాకానుక కిట్లను పాఠశాలలకు సరఫరా చేసినప్పుడు అవి అందినట్లుగా హెచ్‌à°Žà°‚, ఎంఈవో, కమ్యూనిటీ మొబైల్‌ ఆఫీసర్‌(సీఎంవో) సంతకాలతో రసీదు తీసుకోవాలి. కానీ సింహభాగం పాఠశాలల్లో à°ˆ నిబంధనను పాటించలేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సరుకులు సరఫరా చేసినట్లు చూపించి బిల్లులకు చెల్లింపులు చేసేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు 3జతల యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా 2జతలు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలిసింది. నాసిరకంగా ఉండటంతో అవి వెంటనే చినిగిపోతున్నాయని, బ్యాగుల జిప్పులు ఊడిపోతున్నాయని ఆరోపణలు వచ్చాయి.

 

విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నప్పటికీ పలు జిల్లాల్లో బూట్లు, స్కూలు బ్యాగులు పూర్తిగా పంపిణీ కాలేదంటున్నారు. రసీదులు లేకుండానే బిల్లులు చెల్లింపుల కోసం పంపడంపై సీరియస్‌ అయిన ఆర్థికశాఖ సమగ్ర శిక్ష ఏఎ్‌సపీడీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ప్రస్తుత ఎస్‌పీడీ కూడా ఆయనకు మెమో జారీ చేసినట్లు సమాచారం. విద్యాకానుక కిట్లలో అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు సిఫారసు చేయగా ప్రస్తుతానికి à°ˆ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిసింది.