తండ్రీకూతుళ్లను బలితీసుకున్న కరోనా

Published: Sunday April 25, 2021

కరోనా మహమ్మారి కుటుంబాల్లో తీరని విషా దం నింపుతోంది. వైరస్‌ దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలు బలవుతున్నాయి. కృష్ణాజిల్లా నూజివీ డు పట్టణంలో తండ్రీకూతురు కరోనాకు బలవగా.. à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరులో కరోనాకు చికిత్స పొందుతూ భార్య, భర్త à°—à°‚à°Ÿ వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లాలో వైరస్‌ ఒకేరోజు తల్లీకొడుకుని బలితీసుకుంది. నూజివీడులో à°Žà°‚ రాంబాబు అనే వ్యాపారి కుటుంబంలో కొవిడ్‌ తీరని విషాదం నింపింది. రాంబాబు, ఆయన కుమారుడు నూజివీడులో ప్రముఖ వ్యాపారస్తులుగా పేరొందారు. వారిద్దరికీ కరోనా సోకిన విషయం తెలియక ముందే రాంబాబు కుమార్తె డెలివరీకి పుట్టింటింకి వచ్చింది. కొద్ది రోజుల తర్వాత à°ˆ ముగ్గురికీ పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాంబాబు మృతి చెందారు. ప్రీమెచ్యూర్‌ బేబీకి జన్మనిచ్చిన కుమార్తె కరోనాకు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమెకు పుట్టిన శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రాంబాబు కుమారుడు కూడా ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు.

à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరులో ప్లైవుడ్‌ వ్యాపారి విజయశ్రీనివాస్‌(48), భార్య విజయలక్ష్మి(43) కరోనా బారినపడడంతో కడపలోని à°“ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుమార్తెకు కూడా కరోనా లక్షణాలు ఉండటంతో ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉంది. కాగా.. భార్యభర్తలిద్దరూ శనివారం మధ్యాహ్నం à°—à°‚à°Ÿ వ్యవధిలో మృతి చెందారు.

కర్నూలు జిల్లా అహోబిలం మఠం పూర్వపు జీపీఏ వీఎల్‌ఎన్‌ నరసింహన్‌(65), ఆయన తల్లి సరోజమ్మ(85) కరోనాతో శనివారం మృతి చెందారు. వీఎల్‌ఎన్‌ నరసింహన్‌కు పాజిటివ్‌ రావడంతో తిరుపతిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఆయన తల్లి సరోజమ్మ కూడా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఆమెను శనివారం నంద్యాలలోని మరో తనయుడు రామానుజన్‌ ఇంటికి తీసుకువచ్చారు. కాసేపటికే ఆమె మృతి చెందారు.