ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Published: Tuesday May 04, 2021

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజుకూ15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. అయితే పెరుగుతున్న కరోనా కేసులపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్‌ఏ హైకోర్టులో పిల్‌ వేశారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న కొవిడ్ ట్రీట్‌మెంట్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. కొవిడ్ కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది.

 

ఆక్సిజన్ అందక చనిపోతే పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి సీజే బెంచ్‌ సూచనలు చేసింది. à°—à°¤ విచారణలో ప్రస్తావించిన ఆక్సిజన్, పడకలు, ఔషధాలు, కోవిడ్ పరీక్షల ఫలితాలు , వ్యాక్సినేషన్ వంటి పలు కీలకమైన అంశాలపై గంటన్నరకు పైగా విచారణ చేసింది. మృతులకు గౌరవ ప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించింది. గురువారంలోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలు సమర్పించాలని  à°¹à±ˆà°•à±‹à°°à±à°Ÿà± à°†à°¦à±‡à°¶à°¿à°‚చింది.