డబ్బులిస్తే బెడ్‌ ఓకే...

Published: Friday May 07, 2021

నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన à°“ ప్రభుత్వ ఉద్యోగి 15రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. నెల్లూరు అంతా తిరిగినా ఏ ఆస్పత్రిలోనూ బెడ్‌ దొరకలేదు. జీజీహెచ్‌కు వెళ్లి తాను ప్రభుత్వ ఉద్యోగినని, à°’à°• బెడ్‌ ఇచ్చి ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడ్డాడు. అప్పటికే బెడ్ల కోసం పలువురు కాచుకొని ఉండటం, అంతకన్నా సీరియస్‌ కేసులు ఉండటంతో అధికారులు ఆక్సిజన్‌ బెడ్‌ ఇవ్వలేమని చెప్పారు. ఇదంతా గమనించిన à°’à°• దళారి à°† బాధితుడి వద్దకు వెళ్లి, రూ.30వేలు ఇస్తే ఆక్సిజన్‌ బెడ్‌ ఇప్పిస్తానన్నాడు. ప్రాణం మీద తీపితో à°† ఉద్యోగి సరేనన్నాడు. డబ్బు తీసుకోవడానికి à°† దళారి కొత్త పద్ధతి ఎంచుకున్నాడు. పక్క రాష్ట్రానికి చెందినవారి బ్యాంక్‌ ఖాతా నుంచి తాను చెప్పిన ఖాతాకు డబ్బు పంపాలన్నాడు. దీంతో బెంగళూరులోని తన స్నేహితుడికి డబ్బు పంపి, అతని ద్వారా దళారి ఇచ్చిన అకౌంట్‌కు రూ.35వేలు జమ చేయించాడు. ఇంకేముంది... సదరు ఉద్యోగికి అంతే వేగంగా ఆక్సిజన్‌ బెడ్‌ దొరికింది. ఆయన కుటుంబ సభ్యుల్లో మరొకరికి కూడా కరోనా సోకడంతో మరో రూ.35వేలు ఇలాగే ఖాతాలో వేశారు. బెడ్‌ దొరికినా చికిత్స సంతృప్తిగా లేదనే ఉద్దేశంతో ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రికి వెళ్లాలని సదరు బాధితుడి బంధువులు ప్రయత్నించారు. à°† క్రమంలోనే వారి ద్వారా జీజీహెచ్‌లో దళారుల దందా బయటపడింది. 

అధికార పార్టీలో ఆయనో ప్రముఖ నాయకుడు. వారం క్రితం ఆయన వద్దకు à°“ అనుచరుడు వచ్చాడు. ‘‘అన్నా.. మా కుటుంబ సభ్యులకు కరోనా. జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ బెడ్‌ కావాలి’’ అని అడిగారు. వెంటనే à°† నాయకుడు జీజీహెచ్‌ అధికారులకు ఫోన్‌ చేశారు. ‘‘సారీ సార్‌ బెడ్లు ఖాళీ లేవు. అయిన తరువాత చూస్తాం..’’ అన్నారు. అదే మాట à°† నాయకుడు తన అనుచరునికి చెప్పాడు. సాయంత్రం à°† అనుచరుడు మళ్లీ à°† నాయకుని వద్దకు వచ్చాడు. ‘‘అన్నా... నువ్వు అడిగితే బెడ్‌ లేదన్నారు. నేను రూ.30వేలు ఇస్తే బెడ్‌ దొరికిందన్నా..’’ అన్నాడు. కంగుతిన్న నాయకుడు ఆరోజు సాయంత్రమే జీజీహెచ్‌ అధికారులతో సమావేశమై ఆస్పత్రిలో దళారుల విషయం గురించి, తనకు ఎదురైన అనుభవం గురించి వివరించి తీవ్రంగా హెచ్చరించారు. ఇలాగే మూడు రోజుల క్రితం కూడా నెల్లూరు నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నాయకుడు మరొకరు తన అనుచరునికి బెడ్‌ కోసం జీజీహెచ్‌కు ఫోన్‌ చేస్తే ఖాళీ లేవన్నారు. à°…à°°à°—à°‚à°Ÿ వ్యవధిలో à°† అనుచరుడు ఎవరికో ఫోన్‌పే ద్వారా రూ.30వేలు ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో బెడ్‌ దొరికింది. ఆవిషయాన్ని తను నమ్ముకున్న నేతకి చెప్పి ఇదన్నా పరిస్థితి అని మర్మగర్భంగా మాట్లాడాడు. à°† నాయకుడు వెంటనే ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి జీజీహెచ్‌లో దళారులు ప్రవేశించి డబ్బుకు బెడ్లు అమ్ముకుంటున్న తీరుపై పిర్యాదు చేశాడు. 

నెల్లూరులో పేదల ఆస్పత్రిగా పేరొందిన ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లోకి దళారులు చొరబడ్డారు. కరోనా వారికి మాత్రమే కలిసొచ్చినట్టు ఆస్పత్రిలో ఆక్సిజన్‌ పడకలను అమ్మకానికి పెట్టారు. బెడ్‌కు రూ.30నుంచి 40వేలకు పైగా వసూలు చేస్తున్నారు. కరోనా బాధితులకు ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీజీహెచ్‌ మొదటి వరుసలో ఉంది. ఇలాంటి ఆస్పత్రిలో సాక్షాత్తు జిల్లా మంత్రులే సిఫారసు చేసినా బెడ్‌ దొరకని పరిస్థితి. కానీ దళారులు తలుచుకుంటే మాత్రం ఏకంగా ఆక్సిజన్‌ బెడ్‌లే దొరుకుతున్నాయి. ఇక్కడ పనిచేసే కొంతమంది అధికారులు, ఇతర సిబ్బందికి తెలియకుండా గుట్టుగా పడకలు బ్లాక్‌లో అమ్ముకొంటున్నట్లు తెలుస్తోంది. జీజీహెచ్‌కు చీడగా మారిన à°† ఒకరిద్దరిని ఉన్నతాధికారులు వెంటనే ఏరిపారేయాలని, లేదంటే à°ˆ చెద ఆస్పత్రి మొత్తాన్ని ఆక్రమించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.